సమంతకు షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రౌడీబాయ్‌

-

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ముద్దుగుమ్మ సమంత. అయితే ఈ రోజు సమంత పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు పుట్టిన రోజుల విషెస్‌ చెబుతున్నారు. అయితే రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ కూడా సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ.. ఆయన చెప్పిన విషెస్‌తో కొంతసేపు సమంతకు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియలేదు. అంత షాకింగ్‌గా సమంతకు విజయ్‌ విషెస్‌ చెప్పారు.

Vijay Devarakonda Surprises Samantha On Her Birthday With Fake Scene Shooting | Vijay Surprises Samantha: షూటింగ్ స్పాట్‌లో సమంతకు విజయ్ సర్‌ప్రైజ్, ఫేక్ సీన్ క్రియేట్ చేసి మరీ షాకిచ్చారు

సమంత, విజయ్ దేవరకొండ సినిమా కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో ఉంది. గురువారం సమంత పుట్టిన రోజు నేపథ్యంలో ఆమెకు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. రొటీన్‌గా బర్త్ డే సర్ ప్రైజ్ ఇవ్వకుండా.. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఒక ఫేక్ సీన్‌ను క్రియేట్ చేశారు.

Vijay Devarakonda Surprises Samantha With Special Party On The Sets Of 'VD 11'

సమంత ఆ సీన్‌ను నిజమనుకుని నమ్మేసింది. క్యాంప్ ఫైర్ వద్ద విజయ్‌తో సీన్‌లో లీనమైంది. పాత్రలో ఒదిగిపోయి డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. అనంతరం విజయ్ దేవరకొండ తన డైలాగ్ చెబుతూ.. ‘‘సమంత’’ అనేశాడు. దీంతో అతడు పొరపాటున సమంతా అన్నాడు దీంతో సమంత వెంటనే నవ్వేసింది. ఆ వెంటనే విజయ్ ఆమెకు ‘హ్యాపీ బర్త్ డే’ సమంతా అని చెప్పాడు. దీంతో ఒక్కసారి షాకింగ్‌కు గురైన సమంత.. కొద్దిసేపు అందరివైపు చూస్తూనే ఉంది. చిత్రయూనిట్ కూడా పెద్ద కేక్ సమంత ముందు పెట్టి విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news