క్లాస్ వాట్సాప్ గ్రూప్.. టీచర్ల సైజులపై డిబేట్..

-

నేటి అత్యాధునిక యుగంలో టెక్నాలజీని మంచికి ఉపయోగించే వారికంటే.. చెడుకు ఉపయోగించే వారు ఎక్కువ అవుతున్నారు. కోవిడ్ ప్రభావంతో విద్యార్థుల ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిపడ్డాయి. దీంతో.. కొందరు చేదు దారులు తొక్కుతున్నారు. ఓ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు.. అయితే వీళ్ళు చదువు కోసం ఈ గ్రూప్ లో చర్చించడం లేదు.. ఏకంగా.. క్లాసుకు వచ్చే టీచర్ల శరీర సైజులపై చర్చలు జరుపుతున్నారు.. ఆ టీచర్ వక్షోజాలు పెద్దవంటే.. కాదు.. ఈ టీచర్ వి పెద్దవంటూ.. టీచర్ల అంగాలను వర్ణిస్తూ.. డిబేట్ పెట్టుకుంటున్నారు.

అయితే ఈ విషయం టీచర్లకు తెలియడంతో.. విద్యార్థులు వాట్సాప్ గ్రూప్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సంపాదించి.. ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేశారు. దీంతో నివ్వెరపోయిన.. ప్రిన్సిపాల్ విద్యార్థులు తల్లిదండ్రులను పిలిచి చూపించారు. అంతేకాకుండా సదరు విద్యార్థులను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు.. పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news