బాగా అలసి పోతున్నారా..? దాహం ఎక్కువగా వేస్తోందా.. అవి ఈ రోగానికే సంకేతం కావొచ్చు

-

మన శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు వస్తున్నాయి అంటే.. అది భవిష్యత్తులో వచ్చే ఏదో రోగానికి సంకేతాలే.. వాటిని సాధారణ మార్పులు అని పక్కన పెట్టేస్తే.. సినిమా క్లైమాక్స్ వచ్చే వరకూ మనకు మ్యాటర్ అర్థంకాదు.. ఉన్నంట్టుండి బరువు తగ్గుతున్నారంటే.. హ్యాపీగా ఫీల్ అవుతారు కొందరు.. మీరేం చేయకుండా, తినే తిండి తింటూనే ఉన్నా అలా ఎందుకు జరుగుతుంది, ఏం చేసినా సరే వెంటనే అలిసిపోతున్నాం అంటే.. ఒంట్లో బలం లేదేమో.. అందుకే అనుకుంటారు.. అలసట అన్నీసార్లు రావడం మంచిది కాదు.. ఇలాంటి కొన్ని లక్షణాలు.. డయబెటీస్ కు సంకేతాలు.

నేడు ఎంతో మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, వికారం, వాంతులు, శ్వాస సమస్యలు, కడుపు నొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలను కలిగిస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉందని చూపించే కొన్ని లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అధికంగా దాహం..

దాహం పెరగడం, ఆకలి పెరగడం రక్తంలో చక్కెర స్థాయికి సంబంధించిన సాధారణ లక్షణాలలో ఒకటి. రోజంతా ఎంత నీరు తాగుతున్నారో లేదా తింటున్నారో పట్టింపు లేదు. ఎవరైనా పదే పదే ఎక్కువ దాహం, ఆకలితో ఉన్నట్లయితే, అది అధిక రక్తపోటు లక్షణంగా కూడా భావించవచ్చు. నిజానికి, అధిక మొత్తంలో గ్లూకోజ్ అంటే చక్కెర కండరాలకు చేరినప్పుడు, శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దాహం వేస్తుంది.

బరువు తగ్గడం..

బరువు తగ్గిపోతుంటే… దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైనా చాలా త్వరగా బరువు తగ్గితే, అది అధిక రక్తంలో చక్కెరకు సంకేతం అని నిపుణులు అంటున్నారు.

బాగా ఆకలి వేయటం..

తిన్న తర్వాత కూడా మీకు చాలా ఆకలిగా అనిపించవచ్చు. ఎందుకంటే, కండరాలకు ఆహారం ద్వారా అవసరమైన శక్తి లభించదు. శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత గ్లూకోజ్ కండరాలలోకి ప్రవేశించకుండా నిరోధించి శక్తిని అందిస్తుంది. అందుకే శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది.. దీంతో మీకు ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది.

తీపి వాసనగల మూత్రం..

మూత్రం తీపి వాసన వస్తుంటే అది మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉందనడానికి సంకేతం. సాధారణంగా, మూత్రం ద్వారా శరీరం నుంచి విసర్జించబడిన చక్కెర మొత్తాన్ని గుర్తించలేము. అయితే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, అప్పుడు చక్కెర రక్తం నుంచి మూత్రపిండాల ద్వారా, మూత్రం ద్వారా బయటకు వస్తుంది. దాంతో మూత్రం తియ్యని వాసన వస్తుందట.

దృష్టి స్పష్టంగా లేకపోవడం..

మీకు స్పష్టంగా కనిపించకపోతే, అది హైపర్గ్లైసీమియాకు సంకేతం కావచ్చు. ప్రతి నలుగురిలో ఒకరికి టైప్ 2 డయాబెటిస్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయం వారికి తెలియదు. అస్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నప్పటికీ, అది అధిక రక్తంలో చక్కెరకు సంకేతం కావచ్చు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు కంటి వ్యాధులు లేదా ఏవైనా సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఉంది. డయబెటిక్ వచ్చినప్పటి నుంచి కంటి ఆరోగ్యం పై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ ఫోన్ వాడటం, కంటికి శ్రమ కలిగించే పనులు చేయడం తగ్గించాలి. కంటికి మేలు చేసే పోషకాహారం తీసుకోవాలి.

అలసట..

ఎప్పుడూ అలిసిపోతుంటే.. అది అధిక రక్తంలో చక్కెరకు సంకేతం కావచ్చు. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతాయనడంలో సందేహం లేదు. కానీ, రక్తంలో చక్కెర చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, కణాలకు ఆక్సిజన్, పోషకాలు లభించవు. దీని కారణంగా కణాలు సరిగ్గా పని చేయలేవు. అలసిపోయినట్లు అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news