1000 కోట్ల క్లబ్ లోకి ‘కేజీఎఫ్ 2’

-

ఎన్నో రోజులు ప్రేక్షకులు ఎదురుచూస్తున్ కేజీఎఫ్‌2 సినిమా రానే వచ్చింది. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద భారీ వసూల్లు రాబడుతోంది. ఈ నెల 14న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తొలి రోజునే రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన కేజీఎఫ్‌2, ఆ తరువాత అదే జోష్ ను కొనసాగిస్తోంది. మొదటి భాగానికి మించిన వసూళ్లను సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

KGF Chapter 2 box office collection: Yash's film crosses Rs 1000 crore gross worldwide | Entertainment News – India TV

విడుదలైన 15 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. దక్షిణాది నుంచి 1000 కోట్లను రాబట్టిన మూడో సినిమాగా రికార్డు నెలకొల్పింది. తొలి రెండు స్థానాల్లో ‘బాహుబలి 2’ .. ‘ఆర్ ఆర్ ఆర్’ ఉన్నాయి. ‘కేజీఎఫ్’ తరువాత హీరోగా యశ్ క్రేజ్ ఎంతగా పెరిగిందో అంతకంటే ఎక్కువగా దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఇమేజ్ పెరిగింది.

‘ కేజీఎఫ్ 2’ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకి ప్రశాంత్ నీల్ పై వాళ్లు పెట్టుకున్న నమ్మకం ప్రధానంగా కనిపిస్తుంది. మొదటి భాగానికి ఎంతమాత్రం తగ్గకుండా రెండవ భాగం ఉండేలా చూసుకుని ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సినిమాకి మూడవ భాగం కూడా ఉందని చెబుతుండటం అందరిలోనూ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. చూద్దాం.రాఖీ భాయ్‌.. మళ్లీ అలరిస్తాడో లేదోనని..

Read more RELATED
Recommended to you

Latest news