ఓయూ దిక్కు దివానా లేకుండా అయ్యింది : మల్లు రవి

-

రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ NSUI విద్యార్థులు ఉస్మానియా యూనివర్సటీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ను ముట్టడించడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించడానికి బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్ల రవి గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. అరెస్టైన NSUI విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడం ఏంటని పశ్నించారు.

TRS will pay heavily for encouraging defections in future: Mallu Ravi- The New Indian Express

జగ్గారెడ్డి అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఓయూను నిజాం టైం లో కట్టారని, అక్కడ చదివిన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులయ్యారన్నారు. ఇప్పుడు ఓయూ దిక్కు దివానా లేకుండా అయ్యిందని, సమస్యల వలయంలో చిక్కుకుందని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఒక ఎంపీ, ఆయన్ని అడ్డుకోవడం దారుణమని, విద్యార్థులు నిరసన తెలిపితే అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ ను పలకరించడానికి వెళ్తే జగ్గారెడ్డిని అరెస్ట్ చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన విద్యార్థులే రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఓయూలో రాహుల్ కు అనుమతి ఇవ్వాలని వీసీ ని కోరుతున్నామన్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news