తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్..లాక్‌ డౌన్‌లో పెట్టిన కేసుల ఎత్తివేత !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. లాక్‌ డౌన్‌ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్‌ చేసేందుకు కొత్త ప్రయోగంతో… ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్‌ డౌన్‌ సమయంలో.. వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ కింద పలు సెక్షన్లతో పెట్టీ కేసులు నమోదు చేశారు. రూ. 1000 వరకు జరిమానాలు విధించారు.

ఆ సమయంలో నమోదైన దాదాపు 3 లక్షల కేసులు పెండింగ్‌ లో ఉండగా… వాటిని పరిష్కరించు కునేందుకు పోలీసులు భారీ డిస్కౌంట్‌ నున కల్పించారు. ఉల్లంఘనలపై నమోదు అయిన ఒక్కో సెక్షన్‌ కు కేవలం పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.

ఈ అవకాశం ఇవాళ్టి నుంచే అంటే 2 వ తేదీ నుంచి మే 8 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఉల్లంఘన దారులు సద్వినియోగం చేసుకోవాలని నగర అదనపు పోలీస్‌ కమినర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ సూచనలు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక పోతే.. తర్వాత కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news