నా అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు… మంచి పాలన కోసం బీహార్ లో పాదయాత్ర : ప్రశాంత్ కిషోర్

-

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త మరోసారి కాంగ్రెస్ పార్టీ గురించి వ్యాఖ్యానించారు. నా అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేయాలో వారే నిర్ణయించుకోవాలని… నిర్ణయించేది లేదని కుండబద్ధలు కొట్టారు. కాంగ్రెస్ ముఖ్యమైనదిగా భావించే ఏ నిర్ణయమైనా వారు తీసుకున్నారు… అలాగే నా నిర్ణయాన్ని నేను తీసుకున్నా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారని.. వారికి ఏమి చేయాలో తెలుసు అని ఆయన అన్నారు. 

తాజాగా ఆయన బీహార్ రాజకీయాల గురించి తన కార్యాచరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ దేశంలో పేద రాష్ట్రంగా ఉందని… నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ బీహార్ ను డెవలప్ చేయలేదని అన్నారు. వచ్చే 3-4 నెల్లలో జన్ సూరాజ్’ (మంచి పాలన) ఆలోచనలు రూపొందిస్తానని.. అందులో భాగస్వామ్యం చేయడంలో అనేక మంది బీహర్ ప్రజలను , ప్రముఖులను కలుస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అక్టోబఱ్ 2 గాంధీ ఆశ్రమం, పశ్చిమ చంపారన్ నుంచి బీహార్ మీదుగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news