శ్రీలంకకు సైన్యాన్ని పంపాలని కేంద్రాన్ని కోరిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి

-

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కాస్తా రాజకీయ సంక్షోభంగా మారిపోయింది. దేశమంతా హింస ప్రజ్వరిల్లుతుంది. ప్రజా ఆగ్రహంతో ప్రధాని మహీంద రాజపక్సే రాజీనామా చేసి నావల్ బేస్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి దాక్కున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా కష్టతరంగా మారింది. లంకలో నానాటికీ క్షీణిస్తున్న పరిస్థితులు మన దేశానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి.

భద్రతా పరంగా సమస్యలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక పరిణామాల్లో భారత్ జోక్యం చేసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీలంకకు మానవతా సాయం అందిస్తుంది భారత్. ఈ క్రమంలో బిజెపి నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా కేంద్రాన్ని ఓ డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధతను పునరుద్ధరించడానికి భారతదేశం తప్పనిసరిగా శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రస్తుతం భారత వ్యతిరేక విదేశీ శక్తులు ప్రజల ఆగ్రహాన్ని ఉపయోగించుకుంటున్నారని, ఇది భారతదేశ జాతీయ భద్రతను ప్రభావితం చేస్తోందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news