Breaking News : టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసుల మరో అరెస్ట్‌..

-

ఏపీలో టెన్త్‌ పేపర్ల లీకుల కేసులు ఇంకా అరెస్ట్‌లు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా.. పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీసు కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఏ8 గా ఉన్న గంగాధర రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో గంగాధరరావు డీన్ గా పనిచేస్తున్నారు. గంగాధరరావు న్యాయమూర్తి ముందు హాజరు, జుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పదవ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ విషయంలో లోతైన దర్యాప్తుకు సన్నద్ధంగా ఉన్నామని, మా విచారణ మరింత వేగవంతం చేశామన్నారు పోలీసులు.

AP 10th Exam paper leaked: Tenth class question paper leaked in AP, What  are the authorities saying ..?

నారాయణ లాంటి విద్యాసంస్థలు విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి కేవలం ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవడం కోసమే అనైతిక కార్యక్రమానికి పాల్పడిందని, ప్రధాన ముద్దాయి గిరిధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం, లభించిన సాక్షాలు ఆధారంగానే వ్యవస్థీకృత నేరానికి పాల్పడిన నారాయణ ను అరెస్టు చేశాం. అయితే ఆయనకు బెయిల్ లభించింది. ఈ బెయిల్ పై పోలీస్ శాఖ ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకి వెళ్ళనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news