క్రేజీ న్యూస్‌.. కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు పూజా హెగ్డే

-

టాలీవుడ్‌ అందాల భామ పూజా హెగ్దేకు అరుదైన అవకాశం దొరికింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా ఆమె హాజ‌రు కానున్నారు పూజా హెగ్దే. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడు‌క‌లు ఈ నెల 17న మొద‌లు కానున్నాయి. ఈ నెల 28 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ వేడుక‌ల్లో భార‌త ప్ర‌తినిధిగా పూజా హెగ్డే హాజ‌రుకానున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప్ర‌క‌టించింది.

PICS: Pooja Hegde looks ultra-glam in body-hugging midi skirt & crop top  co-ord set at Radhe Shyam promotions | PINKVILLA

ఇదిలా ఉంటే… ద‌క్షిణాది చిత్రాల్లో స‌త్తా చాటుతున్న పూజ‌… కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు ఈ ఏడాదే తొలిసారి హాజరు కానుంది. అంటే… ఈ వేడుక‌ల‌కు తొలిసారి హాజ‌రవుతున్న స‌మ‌యంలోనే భార‌త దేశ ప్ర‌తినిధిగా వేడుక‌ల్లో ఆమె ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నార‌న్న మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news