ఇకపై సినిమాలు చేయబోనని ప్రకటించిన స్టార్‌ హీరో

-

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, తమిళ నాడు స్టార్‌ హీరో ఉదయ నిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తాను సినిమాలు చేయబోనని ప్రకటన చేశారు. సూపర్‌ హిట్ బాలీవుడ్‌ సినిమా ఆర్టికల్‌ 15 కు తమిళ రీమేక్‌ అయిన నెంజుకు నీధి అనే సినిమాలో నటించాడు ఉదయ నిధి. ఈ సినిమా మే 20 వ తేదీన విడుదల కావాల్సి ఉంది.

ఇది కాకుండా మారి సెల్వరాజ్‌ దర్వకత్వంలో మామన్నన్‌ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. అయితే… మామన్నన్‌ తర్వాత తాను సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నట్లు ఉదయనిధి స్వయంగా తాజాగా ప్రకటించేశాడు.

కాగా.. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్‌ ఎమ్మెల్యే గా పోటీ చేసి.. గెలిచాడు ఉదయనిధి. అప్పుడే తన సినీ ప్రస్థానం ఆగిపోతుంది అనుకున్నారంతా. కానీ అలా జరుగలేదు. ముందు నుంచి ఉన్న కమిట్‌ మెంట్స్‌ కారణంగా ఉదయ నిధి అప్పటి కప్పుడు సినిమాలకు దూరం కావడం కష్టమైంది. కానీ తాజా సినిమాలకు గుడ్‌ బై చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news