మరో 6 నెలల లోపే “మా” బిల్డింగ్ కి భూమి పూజ – మంచు విష్ణు

-

సినీ కార్మికులకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. “మా” అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మంది సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారని.. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో మాకు సేవలందించారన్నారు.

మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తామని ప్రకటన చేశారు. మా‌ సభ్యుల వెల్పేర్ , హెల్త్ నా ప్రధాన కర్తవ్యమన్నారు. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారని చెప్పారు మంచు విష్ణు. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారని… ప్రభుత్వ సహకారం ఉంది‌ కాబట్టి …‌పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ డిబేట్ చేసుకోవాలి. మా సభ్యత్వానికి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టామన్నారు మంచు విష్ణు. AIG హాస్పిటల్ వారు మా కు చేస్తున్న సహకారం మరువలేనిది.. AIG హాస్పిటల్ కి ఇంటర్ నేషనల్ లెవెల్ లో చికిత్స కోసం వస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news