ఉద్యోగ బాట పట్టబోతున్న సిద్దార్థ్ కారణం..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దార్థ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. హీరో సిద్దార్థ్ బొమ్మరిల్లు సినిమాతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుని ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒకవైపు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే.. మరొకవైపు కోలీవుడ్లో కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సిద్ధార్థ్ తాజాగా బాలీవుడ్ వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్ లో నటిస్తున్నాడు. తాజాగా సిద్దార్థ్ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు.

ఇక తాజాగా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత కోలీవుడ్లో సెటిలైపోయాడు. ఇక బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు. ఇక ఈయన ఢిల్లీలో జన్మించారు అని ప్రేక్షకులకు తెలిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కువగా దక్షిణాది భాషల్లోని నటించానని తెలిపారు. అయితే తనకు కూడా బాగా హిందీ వచ్చిందని అందుకే మంచి పాత్రలు వచ్చినప్పుడు హిందీలో కూడా నటిస్తూ ఉంటాను అని తెలిపారు. ఇక సిద్ధార్థ్ చెప్పిన ఎస్కేప్ లైవ్ కథ తనకు నచ్చిందని అంతే కాదు ఇలాంటి విభిన్నమైన పాత్రలు తనకు మాత్రమే సెట్ అవుతుంది అని దర్శకుడు అలా ఆలోచించడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపాడు.

సినిమాలలో అలాంటి విభిన్నమైన పాత్రలు దొరకకపోతే ఖచ్చితంగా సినిమా లో నటించడం మానేస్తానని.. నటనకు ఖచ్చితంగా దూరం అవుతాను అని ఇక ఉద్యోగం వెతుక్కుంటాను అని కూడా మీడియాతో వెల్లడించారు. ఇక అలాంటి పాత్రలు నిజంగా సిద్ధార్థ్ కు దొరకకపోతే కచ్చితంగా సిద్దార్థ్ ఉద్యోగ బాట పట్టనున్నట్లు సమాచారం. ఇక సిద్దార్థ్ ఇండస్ట్రీలోనే ఉండాలి అని, అలాంటి విభిన్నమైన పాత్రలు తనకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news