తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. తన నటనతో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరో గా చలామణి అవుతున్న ఈయన ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే 2011లో అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . నిజానికి విద్యాభ్యాసం విషయానికి వస్తే అల్లు అర్జున్ కంటే స్నేహారెడ్డి ఉన్నత చదువులు చదివింది. కానీ వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం , ప్రేమ కారణంగా ఒకరికొకరు కుటుంబంలో వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు.సాధారణంగా ఏ తండ్రి అయినా సరే తన కూతురిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అంటే కచ్చితంగా కట్నకానుకల విషయం దగ్గర తేలాల్సి ఉంది. అయితే ఇదే కట్నం విషయం పై తాజాగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు బన్నీ గురించి కూడా మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కట్నం అల్లు అర్జున్ ఎంత తీసుకున్నారు అనే విషయం ప్రస్తావన రాగా.. అందుకు చంద్రశేఖర్ రెడ్డి చెబుతూ ఒక రూపాయి కూడా అల్లు అర్జున్ కట్నం కింద తీసుకోలేదు.అంతేకాదు బన్నీ చాలా నిస్వార్థపరుడు.. కట్నం విషయంలో ఏమాత్రం ఆలోచనలు చేయలేదు. అంతేకాదు వారి కుటుంబంలో ఎవరికి కూడా కట్నం అనే విషయంపై అసలు ఆలోచనే లేదు. ఇక ఇలా కట్నం తీసుకోకుండా స్నేహ ను వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది . అంతే కాదు ఇది ఎంతో మందికి ఆదర్శం . ఇక కట్నం తీసుకునే ఎవరైనా సరే అల్లు అర్జున్ ని చూసి నేర్చుకోవాలి అంటూ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.