అప్పులు చేయకుండా ఎలా.. రాష్ట్రం ముందుకెళ్లడం లేదు – ఏపీ మంత్రి

-

అప్పులు చేయకుండా ఎలా.. రాష్ట్రం ముందుకెళ్లడం లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ. నిన్న సీజీఎఫ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మట్లాడారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. 8 ప్రధాన ఆలయాలతో పాటు 35 ఆలయాలు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.

మాస్టర్ ప్లాన్ పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ దుర్గ గుడిని ఎంపిక చేశామని.. శాఖలో ఎలాంటి అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల బదిలీల్లో ఎక్కడా అవినీతి జరగడం లేదని.. చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు.

గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని వెల్లడించారు. అప్పులు ఉన్నాయని పథకాలు ఇవ్వమని పవన్ చెప్పగలరా? ప్రభుత్వం ఇచ్చిన 7 లక్షల పరిహారం తర్వాత పవన్ లక్ష రూపాయలు ఇచ్చారన్నారు. చంద్రబాబు ఏది చెప్తే అది పవన్ చెప్తున్నారని.. పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలవుతుందని చంద్రబాబు, పవన్ చెప్పగలరా ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news