ముస్లింల అభివృద్ధి టీడీపితోనే సాధ్యము : చంద్రబాబు

-

ముస్లింల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చంద్రబాబు అన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా చంద్రబాబు పాల్గొనాల్సిన మాచర్ల సభ రద్దయింది.ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు కారణంగా ఈరోజు మాచర్ల ప్రజాగళం సభకు రాలేకపోయానని పేర్కొన్నారు. ఈమేరకు మాచర్ల సభను ఉద్దేశించి చంద్ర బాబు వీడియో సందేశం రిలీజ్ చేశారు.

నియోజకవర్గంలో వైసీపీని చరమగీతం పాడాలనే కసి ప్రజల్లో ఉందని, పల్నాడు ప్రజల త్యాగాలు తన మనస్సులో ఎప్పుడు మెదలుతూ ఉంటాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ కార్యకర్తలు చంద్రయ్య, జల్లయ్య వంటి వారి త్యాగాలు మర్చిపోనని,పార్టీని కన్న తల్లి కంటే మిన్నగా కాపాడుకున్నారని ఉద్ఘాటించారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి వచ్చాక పరిస్థితి మారిందని అన్నారు.మాచర్లలో బ్రహ్మారెడ్డి వంద శాతం విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి పనులు చేశారని వీరిద్దరిని ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news