మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. అఘాయిత్యాలకు తెగపడుతున్నారు కొందరు దుర్మార్గులు. దేశంలోని ఏదో ఏ మూలన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా లో ఓ యువతి పై సొంత పెద్దనాన్నే దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నిందితుడు ఎఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్ కాగా.. మరొకరు యువతి పెద్ద నాన్న గంగాధర్ అని సమాచారం అందుతోంది. వీరిద్దరూ మిత్రులు కావడంతో.. ఆ యువతి పై చాలా లైంగిక దాడికి పాల్పడ్డారు.
యువతి తల్లి దండ్రులు ఇద్దరు చని పోవడంతో.. ఆ యువతిని చేరదీశాడు పెద్ద నాన్న గంగాధర్. ఈ నేపథ్యంలోనే.. యువతి పై పలు మార్లు లైంగిక దాడి చేశాడు. చంద్ర కాంత్, గంగాధర్ బాధితురాలు ప్రస్తుతం ఎనిమిదది నెలల గర్భవతి అయింది. ఆ యువతికి మతి స్థిమితం సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు. కానిస్టేబుల్ చంద్రకాంత్, గంగాధర్ పై కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు పోలీసులు.