ముగిసిన సీఎస్‌కే బ్యాటింగ్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ 151

-

ఐపీఎల్‌ సీజన్ 2022 ముగింపుకు చేరుకుంటున్నా కొద్దీ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఊహించని విధంగా ఎన్నో ములుపు, క్లైమాక్స్‌లతో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే నేడు ముంబాయి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. అయితే టాస్‌ ఓడీ బౌలింగ్‌కు బరిలోకి దిగిన రాజస్థాన జట్టు.. బ్యాటింగ్‌కు దిగిన్‌ చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును కట్టడి చేసింది. దీంతో మొయీన్ అలీ (93) ధాటిగా ఆడినప్పటికీ.. అతనికి ఎవరి నుంచి సరైన సహకారం లభించలేదు. ఆరంభంలోనే రుతరాజ్ గైక్వాడ్ (2) పెవిలియన్ చేరగా.. పవర్‌ప్లే ముగిసిన కాసేపటికే డెవాన్ కాన్వే (16) కూడా వికెట్‌ను సమర్పించుకొని పెవిలియన్ బాట పట్టాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మిస్తాడనుకున్న జగదీశన్ (1), రాయుడు (3) కూడా నిరాశపరిచారు.

CSK vs RR Live Score, IPL 2022 Updates: Rajasthan Royals restricts Chennai Super Kings to 150/6 despite Moeen's 93 - Sportstar

దీంతో అలీకి జత కలిసిన కెప్టెన్ ధోనీ (26) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి… ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో చాహల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడబోయిన అలీ కూడా పెవిలియన్ చేరాడు. చివర్లో మిచెల్ శాంట్నర్ (1 నాటౌట్), సిమర్‌జీత్ సింగ్ (3 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news