కొబ్బరి చిప్పలతో బిజినెస్..నెలకు లక్షల్లో లాభం వస్తుందట..!

-

దేవుడికి కొబ్బరికాయ కొట్టి మనలో చాలామంది..ప్రసాదంగా తింటే ఎక్కువ కాయలు ఉన్నాయంటే..వాటితో ఏ పచ్చడో లేక..కొబ్బరిలడ్డూలో చేసుకుంటాం..ఇక ఆ చిప్పలను సిటీలో అయితే పడేస్తారు.ఊర్లళ్లో ‌వాళ్లు పొయ్యిలో పెడతారు. ఇంతకు మించి మనం కొబ్బరి చిప్పలతో చేసేదేమి ఉండదు కదా. కానీ కేరళకు చెందిన మరియా కురియకోస్ అనే అమ్మాయి మాత్రం ఈ చిప్పలతో ఆందమైన పాత్రలు తయారుచేస్తుంది. కాదేది కళకు అనర్హం అన్న చందాగా ఆమె..కొబ్బిరిచిప్పలతో మంచి పాత్రలు చేస్తూ..దాన్నే వ్యాపారంగా మలుచుకుంది. చిప్పబిజినెస్ కదా..డబ్బులు ఏం వస్తాయ్ అనుకుంటున్నారేమో..నెలకు లక్షల కొద్దీ ఆదాయం వస్తుందట.! మీరు ఓసారి ఈ స్టోరీ పై లుక్కేయండి..!

కేరళలోని త్రిస్సూర్‌లో పుట్టిపెరిగిన ఆమె.. విదేశాల్లో ఎంబీఏ చదివింది.. ఇండియాకు తిరిగొచ్చాక కొన్నేళ్ల పాటు ఉద్యోగం కూడా చేసిందట. అయితే చిన్నప్పటి నుంచే వ్యాపారం చేయాలన్న ఆశ ఉండటంతో..తన ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ చేయాలనుకుంది. బిజినెస్ చేయాలన్న కోరిక ఉంది కాని…ఏం వ్యాపారం చేయలనే క్లారిటీ లేదు..ఈ క్రమంలోనే..ఓ సారి స్థానిక కొబ్బరినూనె మిల్లుకు వెళ్లింది. అప్పుడే… కొబ్బరి చిప్పల్ని వృథాగా పడేయడం చూసిన మరియా.. వాటినే తన వ్యాపార సూత్రంగా మలచుకోవాలని డిసైడ్ అయింది. ఇందుకోసం నెట్ లో సర్చ్ చేసి..యూట్యూబ్‌లో పలు వీడియోలు కూడా చూసింది.

ఇలా వీడియోస్ చూసి.. రీసెర్చిలో భాగంగానే కొబ్బరి చిప్పలతో మృదువైన పాత్రలు, వంట సామగ్రి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. తక్కువ ధరకే శాండింగ్‌ మెషినరీని కొనుగోలు చేసి…దీంతో చిప్పల బయటి భాగాన్ని మృదువుగా మార్చి.. వివిధ రకాల బౌల్స్‌, పాత్రలు తయారుచేసిందట. వీటిని ఎగ్జిబిషన్లు, ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా పేజీల్లో అమ్మకానికి పెట్టింది..మంచి స్పందన రావడంతో ‘Thenga’ అనే స్టార్టప్‌ని ప్రారంభించింది.. తెంగ అంటే మలయాళంలో కొబ్బరి అని అర్థం.

లక్షల్లో ఆదాయం..!

‘అయితే క్రమంగా తన ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. బయటి నుంచి వచ్చే ఆర్డర్లను తయారుచేసి ఇవ్వడానికి కొంతమంది కళాకారుల్ని కూడా పెట్టుకుంది.. ప్రస్తుతం తన వద్ద విభిన్న పరిమాణాల్లో బౌల్స్‌, వంట పాత్రలు, స్పూన్స్‌, ఫోర్క్‌లు, టీకప్స్‌, క్యాండిల్స్‌, హ్యాంగింగ్‌ ప్లాంటర్స్‌, కంటెయినర్స్‌, షాట్‌ గ్లాసెస్‌, సోప్‌ కేసెస్‌, టైల్స్‌.. వంటివెన్నో రూపుదిద్దుకుంటున్నాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ..కొబ్బరి చిప్పలతో ఇన్ని తయారు చేస్తున్నారా అనిపిస్తుంది. ఇక వీటికి గ్లాసీ లుక్‌ అందించడానికి కొబ్బరి నూనెతో వార్నిష్‌ చేస్తున్నారు… లేజర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో మరికొన్ని ఉత్పత్తులకు అదనపు హంగులద్దుతున్నట్లు ఆమె తెలిపింది.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో తమ వస్తువులు అందుబాటులో ఉన్నాయట. వీటి ద్వారా నెలకు సుమారు రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తోందట. ఇక ఈ వ్యాపారంలో తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం కూడా ఎంతో ఉందని తెలిపింది కురియకోస్. ఏదైనా చేయాలన్న కోరిక బలంగా ఉంటే..మీనమేషాలు లెక్కించుకోకుండా స్టెప్ తీసుకోవాలని కురియకోస్ అంటుంది. అంతే కదా..వాళ్లు ఏమనుకుంటారో. వీళ్లు ఏం అంటారో అని..చాలామంది తమ ఆశలను , ఆశయాలను అణగదొక్కుకుంటారు. కానీ ఏదైతే అది అయిందని ముందుకేళ్తేనే..జీవితం యెక్క అసలైన రుచిని చూడగలుగుతారు. పడితే మళ్లీ లేవాలి..మునపటి కంటే గట్టిగా ప్రయత్నించాలి..ఈ పద్దతినే ఎంతో మంది వ్యాపారవేత్తలు ఫాలో అయ్యారు..అ‌వుతున్నారు కూడా.! ఇన్ స్టాగ్రామ్ లో తన ఖాతాలో మనం ఈ కొబ్బిరి చిప్పల అందమైన ఆకృతులను చూడొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Thenga (@thenga_coco)

Read more RELATED
Recommended to you

Latest news