ఈ రాశి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు..

-

మే 28 శనివారం ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము..

మేషం: కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనుకున్న పనులు వెంటనే పూర్తి అవుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పురోభివృద్ధి..ఈరోజు దూర ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలు వాయిదా. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఖర్చులు. అధికం. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు విశ్రాంతి లోపం. ఈరోజు పనులు మందకొడిగా సాగుతాయి.

మిథునం: కొత్త పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు పూర్తీ అవుతాయి.. వాహన సౌఖ్యం కూడా ఉంది.వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు ఉంటుంది..ఈరోజు దైవదర్శనాలు చేస్తారు.

కర్కాటకం: సంఘంలో పరపతి పెరుగుతుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం..కొత్త రుణాలు లాభిస్తాయి..

సింహం: ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. కృషికి తగ్గ ఫలితం అంతంత మాత్రమే. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు స్వల్ప ఒత్తిడులు..కొంత నిరాశ కలుగుతుంది.నూతన పనులు వాయిదా వేస్తారు.

కన్య: చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం. దూరప్రయాణాలు ఎక్కువగా చేస్తారు..దైవదర్శనాలు. ప్రముఖులతో సంభాషణలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొంత అనుకూలం.

తుల: పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురుండదు. కొత్త వ్యక్తుల పరిచయం. కళాకారులకు సన్మానాలు..శుభకార్యాలు చేస్తారు..విందు వినోదాలలో పాల్గొంటారు.

వృశ్చికం: ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు..సమాజంలో గౌరవం లభిస్తుంది.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. తీర్థయాత్రలు. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. వాహనసౌఖ్యం. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది..ఈరోజు ప్రశంసలు పొందుతారు.

మకరం: ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేస్తారు.. వ్యాపారులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు మరింత శ్రమించాలి..విందువినోదాల లో పాల్గొంటారు..

కుంభం: సోదరులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. దేవాలయ దర్శనాలు చేస్తారు. విందులువినోదాలు. కొత్త నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన సమయం.ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి.

మీనం: కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం..ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news