ఆరకాకరకాయను ఆరగించారంటే.. ఆ సమస్యలు మాయం.. కాస్ట్ కాస్త ఎక్కువైనా తింటే మంచిదే..!

-

కడుపునిండా తినటం ముఖ్యంకాదు..మంచి పోషకాలు ఉన్నవాటితో తినటం ముఖ్యం. అందులోను ఒకదాని తరువాత ఒక వైరస్ వస్తుంటే..మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవడాని ఏకైకా మార్గం శరీరాన్ని రోగాలకు తట్టుకునేలా స్ట్రాంగ్ చేయటం. చిన్న చిన్న వాటినే తట్టుకోలేపోతే చాలా కష్టం అయిపోతుంది.

రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం, పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. దీంతో మీరు అవసరమైన విటమిన్లతోపాటు ఖనిజాలను పొందే అవకాశం ఉంది. కూరగాయల్లో మనకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఈరోజు మనం బోడకాకకర కాయ, ఆర కాకరకాకయ అని రకరకాల పేర్లతో పిలుచునే కూరగాయ గురించి తెలుసుకుందాం. చాలామందికిని ఈ కూర అంటే ఇష్టం ఉంటుంది. ఊర్లలో అయితే ఇది తెలియని వారంటూ ఉండరు. ఇక నగరాల్లో అయితే..కేజీ కాయలు కొనాలంటే..100నుంచి 200వరకు పెట్టాల్సిందే.

బోడకాకర కాయలో ఉన్న విటమిన్స్

బోడకాకర కాయలో ఒకటి రెండు కాదు ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఉంటాయి. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన కూరగాయగా దీనికి పేరుంది.

ఈ వ్యాధులకు బోడకాకరతో చెక్ పెట్టొచ్చు..

వర్షాకాలంలో వర్చే దురదల నుంచి ఈ కాయ కాపాడుతుంది.
పైల్స్, జాండిస్ వంటి వ్యాధులను సైతం ఇది తినటం వల్ల తగ్గిపోతాయి.
రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.
పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యలతో బాధపడేవారు ఇది తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఇది తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
దీన్ని తినడం వల్ల మధుమేహ రోగులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

కాస్ట్ ఎక్కువగా ఉంటుందని దీనిని చాలామంది తీసుకోరు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వాటికి ఖర్చుపెట్టినా అంతకుమించి ప్రయోజనాలు పొందుతాం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news