బిజినెస్ ఐడియా: స్నాక్స్ బిజినెస్ తో అదిరిపోయే లాభాలు..ఎంత సంపాదన తెలుసా?

-

డబ్బులను సంపాదించాలనే కోరిక అందరికి ఉంటుంది.. కొత్తగా బిజినెస్ చేయాలని అనుకోనేవారికి ఈ బిజినెస్ బాగుంటుంది.. స్నాక్స్ చేసి వాటిని కరెక్ట్ గా మార్కెట్ లో అమ్మితే మంచి లాభాలు వస్తాయి. ఇంతకీ ఆ బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి..ఎలా మార్కెట్ చేయాలి వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్నాక్స్ తయారు చేసి లక్షల్లో సంపాధించవచ్చు. ఎంత క్వాలిటీ, రుచి మెయింటేన్ చేస్తే మీకు అన్ని డబ్బులు రావడం గ్యారెంటీ. ఈ బిజినెస్ ను తక్కువ పెట్టుబడి, తక్కువ మ్యాన్ పవర్, తక్కువ స్థలంలోనూ ప్రారంభించగలగడం మరో విశేషంగా చెప్పొచ్చు. ఈ వ్యాపారాన్ని గ్రామం, నగరం లాంటి తేడా లేకుండా ఎక్కడైనా ప్రారంభించగలగొచ్చు. అయితే.. మార్కెటింగ్ చేయడంపై మీకు వచ్చే ఆర్డర్లు, లాభాలు ఆధారపడి ఉంటాయి..

ఇంట్లో ఎవరికైనా రక రకాల పిండి వంటలను చెయ్యడం వస్తే చాలు ఈ బిజినెస్ చేయడం చాలా సులువు..అయితే కొంచెం పెద్దగా ఈ బిజినెస్ ను ప్రారంభించాలనుకుంటే మాత్రం వివిధ రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ఫుడ్ లైసెన్స్, MSME రిజిస్ట్రేషన్ మరియు GST రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉన్నాయి. ముందు అన్ని రకాల పిండి, నూనె, శనగపిండి, ఉప్పు, నూనె, మసాలాలు, వేరుశెనగలు, పప్పులు మీకు అవసరం. వంట మిషనరీ తో పాటు ప్యాకేజింగ్ మరియు వెయింగ్ మెషిన్ మొదలైన కొన్ని యంత్రాలు అవసరం. దీనితో పాటు, మీకు 1-2 మంది ఉద్యోగులు కూడా అవసరం.

ఈ బిజినెస్ ను ముందుగా ఐదు వేలతో ప్రారంభించ వచ్చు..బిజినెస్ డేవేలప్ అయ్యే కొద్ది మెల్లగా వ్యాపారాన్ని కూడా పెంచవచ్చు.కనీసం 2 నుండి 6 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీ వ్యాపారం సక్సెస్ అయితే.. మీకు 20 నుండి 30 శాతం వరకు లాభాలు వస్తాయి..కస్టమర్లను ఆకర్షిస్తే చాలు ఆటోమేటిక్ గా బిజినెస్ కూడా పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news