నౌకాదళం చేతుల్లోకి విమాన వాహన నౌక ‘విక్రాంత్’

-

దేశీయంగా తయారు చేసిన విమాన వాహన నౌక ‘విక్రాంత్’ భారత నౌకాదళ చేతుల్లో అప్పగించనున్నారు. ఈ మేరకు విక్రాంత్‌పై వినియోగించేందుకు మొత్తం 26 ఫైటర్ జెట్ల కొనుగోలుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందం ఆధారంగా ఈ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫ్రాన్స్ దేశం నుంచి రఫేల్ యుద్ధ విమానాలు కొన్న కేంద్రం.. అమెరికా ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాలను గోవాలో ఐఎన్ఎస్ హంసపై పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షలు జూన్ 15వ తేదీ నాటికి పూర్తి కానుంది.

విమాన వాహన నౌక ‘విక్రాంత్’
విమాన వాహన నౌక ‘విక్రాంత్’

మొత్తం 26 యుద్ధ విమానాల్లో కనీసం 8 ట్విన్‌సీట్స్ రకాలు ఉండాలని నౌకాదళం కోరుకుంటోంది. వీటిని శిక్షణకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అయితే ఈ విమాన వాహన నౌక విక్రాంత్ కోసం ఫైటర్ జెట్‌లను లీజుకు తీసుకునే ఉద్దేశంలో భారత్ లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు యుద్ధవిమానాలను ఎయిర్ క్రాఫ్ట్‌ లపై ల్యాండ్ చేయలేదని, ప్రస్తుతం అవి కర్వార్ మెయింటనెన్స్ లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, విక్రాంత్‌పై ఇప్పటికే సముద్రంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీన ప్రధాని మోడీ అధికారికంగా నౌకాదళానికి అప్పగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news