ప్రముఖ వ్యాపారవేత్తతో నటి పూర్ణ ఎంగేజ్మెంట్

-

సినీ ఇండస్ట్రీలో నటి పూర్ణ గురించి తెలియని వారుండరు. అవును, సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కేవలం హీరోయిన్ పాత్రలో కాకుండా.. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలోనూ ఆమె నటించారు. కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. ఢీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అలా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.

షానిద్ అసిఫ్ అలీ- నటి పూర్ణ
షానిద్ అసిఫ్ అలీ- నటి పూర్ణ

తాజాగా తన నిశ్చితార్థం విషయాన్ని పూర్ణ అధికారికంగా ప్రకటించింది. కుటుంబం, సన్నిహితుల సమక్షంలో తన కాబోయే భర్తతో కలిసి కొత్త అడుగు వేశానంటూ చెప్పుకొచ్చింది. పూర్ణ.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. తన కాబోయే భర్త పేరు షానిద్ అసిఫ్ అలీ అని తెలిపింది. ఇతను దుబాయ్‌లో వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు. కాగా, గత కొద్ది రోజులుగా పూర్ణ, తన కుటుంబసభ్యులు దుబాయ్‌లో ఉంటున్నారు. త్వరలో పెళ్లి డేట్ ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో.. పలువురు పూర్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://www.instagram.com/p/CeQBKYSDO1k/?utm_source=ig_embed&ig_rid=ce0b496f-4e9c-4c76-82a4-64020ed3b8e0

Read more RELATED
Recommended to you

Latest news