‘అన్‌స్టాపెబుల్’..ఫిల్మ్ గ్రాండ్ ఓపెనింగ్..హీరోగా వీజే సన్నీ

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ విజేత వీజే సన్నీ హీరోగా సినిమా గ్రాండ్ ఓపెనింగ్ అయింది. ‘సన్నాఫ్ ఇండియా’ ఫేమ్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ కు అతిరథ మహారథులు వచ్చారు.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి. RRR సినిమా రచయిత వి.విజయేంద్రప్రసాద్, డైరెక్టర్ బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, యంగ్ హీరో తనీష్, యాంకర్, నటుడు బిత్తిరి సత్తి తదితరులు పాల్గొన్నారు. విజయేంద్రప్రసాద్ వీజే సన్నీపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్ కు క్లాప్ కొట్టగా, బీ గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు.

‘అన్ స్టాపెబుల్’ అనే టైటిల్ తో పాటు..నో డౌట్ 100 పర్సెంట్ ఎంటర్ టైన్మెంట్ అనే క్యాప్షన్ తో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ డైమండ్ రత్నబాబు. కాగా, సినిమాను ఏ 2 బీ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రంజిత్ రావ్.బి ప్రొడ్యూస్ చేస్తున్నారు. బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ యూనిట్ వారు విడుదల చేసిన పోస్టర్ లో వీజే సన్నీతో పాటు సప్తగిరి చక్కగా కనబడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news