సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

-

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. ఆమె కరోనా బారిన పడ్డట్టు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. గత వారం రోజులుగా ఆమె పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నట్టు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని సూర్జేవాలా తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెకు స్వల్ప జ్వరం వచ్చిందని వివరించారు.

దీంతో ఆమె కరోనా టెస్ట్ చేసుకున్నారని తెలిపారు. ఈ టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఆమెకు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఐసోలేషన్ లోకి వెళ్లారని చెప్పారు. మెడికల్ కన్సల్టేషన్ పూర్తయిందని, ఆమె ఇప్పుడు కోలుకుంటున్నారని వివరించారు.కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఈడి బుధవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news