ప్రముఖ మెసేజింగ్ మెటా కంపెనీ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ తో ముందుకు వస్తోంది. ప్రతి నెలా కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతోంది. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను మళ్లీ చూసుకోవచ్చు. డిలీట్ బటన్‌తో అన్‌డూ బటన్‌ను కంపెనీ తీసుకోరావచ్చు. WABetainfo నివేదక ప్రకారం.. కంపెనీ ఈ ఫీచర్‌ని త్వరలో తీసుకురానున్నట్లు సమాచారం.
మెటా దాని ఇన్‌స్టంట్ మెసేజ్ యాప్‌లోని అన్‌డూ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది తొలగించిన సందేశాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలోనే ఉందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వాట్సాప్ 2.22.13.5కి జోడించబడింది. బీటా వెర్షన్‌లో మాత్రమే రన్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీరు అన్‌డూ బటన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ బటన్ స్క్రీన్ దిగువన కనిపిస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం.