సూర్య భగవానుడు కుమారుడు శనీశ్వరుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏదొక విధంగా ఎవరొకరిని బాధిస్తారు.ఆయన నుంచి విముక్తి పొందడానికి జనాలు ఏవేవో చేస్తున్నారు. ఈరోజు నుంచి శని తిరోగమనం చేయబోతున్నాడు. దీంతో శనీశ్వరుడు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు లాభాన్ని ఇస్తాడు..కొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాన్ని కూడా కలిగించివచ్చు.ఇక ఆలస్యం ఎందుకు ఆ వ్యక్తుల గురించి శని ప్రభావం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శనీశ్వరుడు 141 రోజుల పాటు తిరోగమన దిశలో కదలనున్నాడు. ఏప్రిల్ 29 2022న శని రాశిలో మార్పులు చోటు చేసుకున్నాయి. శని తన సొంత రాశి అయిన కుంభరాశికి చేరుకున్నాడు. తిరోగమన సమయంలో, శని మళ్లీ జూలై 12న మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. 17 జనవరి 2023 వరకు ఈ రాశిలో ఉంటాడు. దీని తర్వాత మళ్లీ కుంభరాశికి చేరుకుంటాడు. మకరరాశిలో ప్రవేశించే సమయంలో కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశుల్లో శనీశ్వర ప్రభావం కొనసాగుతోంది. ఈ రాశుల వారికి వచ్చే ఒక నెల కాస్త కష్టంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంటుంది..
అలాంటి వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పూజించాలి. నల్ల నువ్వుల నైవేద్యంగా సమర్పించాలి. లింగానికి నీటితో అభిషేకం చేయాలి.
పేదలకు దానం చేయండి. ఆర్ధిక శక్తిని అనుసరించి నిరుపేదలకు సహాయం చేయండి. ఏ నిస్సహాయ వ్యక్తిని వేధించవద్దు.. ఇలా చేయడం శనీశ్వరుడికి కోపం తెప్పిస్తుంది.
కుక్కలకు రొట్టెలను ఆహారంగా అందించండి. నల్లటి కుక్కకు రోటీలో ఆవనూనె కలిపి ఆహారంగా ఇవ్వండి. ఒక పాత్రలో ఆవాల నూనె పోసి అందులో మీ ప్రతిబింబాన్ని చూసి.. అనంతరం ఆ నూనెను దానం చేయండి.శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి . అలాగే శనీశ్వరుడికి, హనుమంతుడికి దీపం వెలిగించండి.క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. శని చాలీసా, శని మంత్రాలను జపించండి.ఆ దేవుడికి కోపం తెప్పించే విధంగా ఎటువంటి పని చెయ్యక పోవడం మంచిది..