బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్ వ్యాక్సిన్‌కు అనుమతి

-

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాపై మరో ముందడుగు పడింది. ఇప్పటికే కరోనా నుంచి రక్షణ పొందడానికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఈ మేరకు కొన్ని ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించింది. అయితే తాజాగా మరో బూస్టర్ డోస్‌ను డీసీజీఐ అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ రూపొందించిన కార్బెవాక్స్ (Carbevax) వ్యాక్సిన్‌కు బూస్టర్ డోస్‌గా అనుమతి లభించింది.

కార్బెవాక్స్ వ్యాక్సిన్
కార్బెవాక్స్ వ్యాక్సిన్

ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ వేసుకోవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది. అయితే గతంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులుగా తీసుకొచ్చిన డీసీజీఐ.. తాజాగా దేశంలో అనుమతి పొందిన మొట్టమొదటి బూస్టర్ వ్యాక్సిన్ కార్బెవాక్స్‌ ను తీసుకొచ్చింది. ఈ మేరకు కార్బెవాక్స్ కొత్త రికార్డును సృష్టించింది. ఈ మేరకు బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఆమోదం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ వ్యాక్సిన్‌తో కరోనా కట్టడి చేయడానికి, బూస్టర్ డోసుల ఉత్పత్తిని, అవసరాన్ని పరిష్కరించే అవకాశం లభించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news