పది ఫలితాలకూ
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత
నారాయణకూ ఏ సంబంధం లేదా ?
ఉంటే గింటే మరి ! ఆయన్నెందుకు ఆ రోజు
నిందితుడిగా భావించి కేసులు పెట్టారు.
వాటిపై నోరు విప్పడం లేదు ఎందుకని?
ఇవీ టీడీపీ తరఫు ప్రశ్నలు.
మాట్లాడితే చాలు రాజకీయ ఆరోపణలు చేసే వైసీపీ సర్కారు ఇప్పుడెందుకో తగ్గిపోతోంది. వెనక్కు తగ్గిపోతోంది. ఎన్నికలకు రెండేళ్ల దూరం ఉందో లేదో కానీ విపక్షంపై చేసిన ఆరోపణలు, చేయించాల్సి న దర్యాప్తులపై మాత్రం వెనక్కు తగ్గిపోతోంది. రాజధానిలో ఏవో అక్రమాలు జరిగేయని చెప్పిన ఏపీ సర్కారు (ఇప్పటి) తరువాత వాటిని ప్రూవ్ చేసేందుకు చొరవ మాత్రం చూపలేకపోయిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో టెన్త్ ఎక్జామ్స్ పేపర్ లీక్ కేస్ కూడా వీక్ అయిపోయింది.
ఈ తరుణంలో ప్రముఖ విద్యా వేత్త అయిన నారాయణ ఏమంటాడో ! ఆయనెందుకు మాట్లాడడం లేదో అటుంచితే ఈ కేసు విషయం ఏమయిందో మాత్రం ఇప్పటికీ అంతుపోలడం లేదు. అంటే ఇవాళ్టి టెన్త్ రిజల్ట్ ఆధారంగా చూస్తే పరీక్షలకు సంబంధించి ఏ తప్పిదాలూ జరగలేదా ? లేదా పరీక్ష పేపరు లీకు అన్నది కేవలం నాటకమా ? ఆరోపణలే అయితే ఆధారాలేవి ? వీటిపై కూడా ఇప్పటికైనా మాజీ మంత్రి నారాయణ మాట్లాడితే బెటర్..లేదంటే ఆయనపై ఉన్న ఆరోపణలే నిజం అని అనుకునే ప్రమాదం ఉంది.
కష్టపడి చదువులు చెప్పాం అని అంటున్నారు ఉపాధ్యాయులు. కష్ట పడి చదివి పరీక్షలు రాశాం అని అంటున్నారు విద్యార్థులు. ఇవేవీ కాదు ఇరవై ఏళ్లలో ఇంతటి ఘోరం మా కంటితో చూడలేదు.. మా చెవితో వినలేదు.. మా నోటితో పలకలేదు అని అంటున్నారు ఇంకొందరు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఆ రోజు పదో తరగతి పేపర్ లీకేజీ ఆరోపణకు సంబంధించి నెల్లూరు నారాయణ (ప్రముఖ విద్యావేత్త మరియు మాజీ మంత్రి) అరెస్టు అయ్యారు. క్షణాల్లో బెయిల్ పై విడుదలయ్యారు కూడా ! హైద్రాబాద్ నుంచి చిత్తూరుకు తీసుకువచ్చి మరీ ! మేజిస్ట్రేట్ ముందు గౌరవ పోలీసులు ఆయన్ను హాజరుపరిచారు.
ఆరోజు తెలగు పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయిందన్న ఆరోపణలు రావడం మరీ విడ్డూరం. అయితే అవన్నీ నిజాలో అబద్ధాలో తరువాత ఇంతకూ ఆ ఘటన కు సంబంధించి ఫాలో అప్ ఏమయింది. వైసీపీ సర్కారు మరిచిపోయిందా లేదా ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేసిందా? ఈకేసుతో పాటు రాజధానిలో ఏవో అక్రమాలు చేయాలని చూశారని, చేశారని, రింగ్ రోడ్డు అలైన్మెంట్ తనకు చెందిన వారికి అనుకూలంగా మార్చేశారని ఆరోపణలు చేస్తూ, అభియోగాలు మోపుతూ సీఐడీ నోటీసలు ఇచ్చిందే ! కేసు నమోదు చేసిందే ! అదేమయింది ? వీటన్నింటిపై స్పందించాల్సిన నారాయణ మాత్రం మాట్లాడడం లేదు. అదేవిధంగా దర్యాప్తునకు సంబంధించి మాట్లాడాల్సిన సీఐడీ వర్గాలు కూడా మాట్లాడడం లేదు. పోనీ ! దర్యాప్తును వేగవంతం చేయండని ప్రభుత్వమూ ఆదేశించడం లేదు. ఎందుకని ? ఏమయింది ?