4 రాష్ట్రాల పరిధిలో నేడు రాజ్యసభ ఎన్నికలు

-

ఇటీవల ఎన్నికల కమిషన్‌ 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లో 16 స్థానాలకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బలం తగ్గనుంది. అలాగే, ఇటీవలే పెద్దల సభలో 100 మార్కు చేరుకున్న బీజేపీ బలం సైతం నూరులోపే పరిమితం కానుంది.

Parliament: Lok Sabha resumes with discussion on Covid-19 | Hindustan Times

జూన్‌- ఆగస్టు మధ్య వివిధ తేదీల్లో 57 మంది ఎంపీల పదవీకాలాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉండడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటింగ్‌ పూర్తయిన గంట తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news