తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీకు ఎంత తెలుసు?

-

ఏదో ఊరికే పోరాటం చేస్తే తెలంగాణ రాదు. దానికి ఒక ప్లాట్ ఫాం కావాలని… రాజకీయ పార్టీని స్థాపించి.. మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. అలా ఏళ్ల పాటు పోరాటం చేస్తే తెలంగాణ ఫలించింది. కానీ.. ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు, కుట్రలు, కుతంత్రాలు, బలిదానాలు.

తెలంగాణ.. పోరాటాలకు పురిటి గడ్డ, తిరుగుబాటుకు తిరుగులేని గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ. భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటం కాస్త.. తర్వాతర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం జరిగింది. తొలి దశ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రస్తావనే రాలేదు. కానీ.. మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించి రానేరాదు అనుకున్న తెలంగాణను తీసుకొచ్చి చూపించారు కేసీఆర్.

ఏదో ఊరికే పోరాటం చేస్తే తెలంగాణ రాదు. దానికి ఒక ప్లాట్ ఫాం కావాలని… రాజకీయ పార్టీని స్థాపించి.. మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. అలా ఏళ్ల పాటు పోరాటం చేస్తే తెలంగాణ ఫలించింది. కానీ.. ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు, కుట్రలు, కుతంత్రాలు, బలిదానాలు. అసలు తెలంగాణ మలి ఉద్యమంలో ఏం జరిగింది? కేంద్రం మెడలు వంచి తెలంగాణను కేసీఆర్ ఎలా తీసుకొచ్చారు. కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత ఏం జరిగింది? కేంద్రం ఇస్తానన్న తెలంగాణను వెనక్కి ఎందుకు లాగేసుకుంది? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేవన్నీ ప్రతి తెలంగాణ పౌరుడికి తెలుసు.

అయితే… తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించి.. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన కృషిని మళ్లీ మనకు చూసే అదృష్టం దక్కింది ఈ సినిమాతో. అవును… ఉద్యమ సింహం పేరుతో వచ్చిన కేసీఆర్ బయోపిక్ ను చూసి మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోండి. గత కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news