ఢిల్లీకి చెందిన బచన్ సింగ్ వయస్సు 111 ఏళ్లు. ఢిల్లీలో అత్యంత వృద్ధ ఓటరు ఈయనే. ఈయన తిలక్ విహార్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును తాజాగా వినియోగించుకున్నాడు.
ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగం కల్పించిన అనేక హక్కుల్లో ఓటు హక్కు కూడా ఒకటి. దాంతో మనకు నచ్చిన నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవచ్చు. నచ్చని వారిని తిరస్కరించొచ్చు. అయితే నేటి తరుణంలో కొందరు తమకు ఉన్న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం లేదు. దీంతో ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతోంది. అయితే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని.. పనిచేసే ప్రభుత్వాలకే ఓటు వేయాలని చెబుతున్నాడు.. ఢిల్లీలోని ఆ వృద్ధ ఓటర్..!
ఢిల్లీకి చెందిన బచన్ సింగ్ వయస్సు 111 ఏళ్లు. ఢిల్లీలో అత్యంత వృద్ధ ఓటరు ఈయనే. ఈయన తిలక్ విహార్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును తాజాగా వినియోగించుకున్నాడు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈయన సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసి వచ్చేవాడు. అయితే ఈ సారి ఆయన నడవలేకపోతుండడంతో అధికారులు ఆయన్ను కారులో తీసుకువెళ్లి ఓటు వేయించారు.
ఓటు వేసిన సందర్భంగా బచన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు విలువ తెలుసని అన్నాడు. పనిచేసే ప్రభుత్వాలకే తాను ఓటు వేస్తానని తెలిపాడు. అయితే ఢిల్లీలో ఇన్నేళ్లుగా ఉంటున్నా బచన్ సింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒకటుందని కూడా తెలియదట. ఆయన 1951 నుంచి ఢిల్లీలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు కేవలం కాంగ్రెస్, బీజేపీ పార్టీలే తెలుసట. అందుకనే అప్పటి నుంచి ఆ రెండు పార్టీల్లో ప్రతి సారీ ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఢిల్లీలో జరిగిన ఎన్నికల పోలింగ్‌లో అతను పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఏది ఏమైనా.. అతను ఓటర్లకు చెబుతున్నది ఒక్కటే.. మెరుగైన నాయకులకే ఓటు వేయాలని.. సమర్థవంతమైన పార్టీలనే ఎన్నుకోవాలని.. అంటున్నాడు.. అవును మరి.. ప్రజలందరూ అలా చేస్తేనే చక్కని పాలన లభిస్తుంది. లేదంటే.. అవినీతి పరులు రాజ్యాలను ఏలుతారు..!