నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం నాడు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఉదయం 11:30 గంటలకు రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్తే.. రాత్రి 9:30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం ఓ గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదని.. రేపు (మంగళవారం) కూడా ఈడి ఆఫీస్ కి రావాలని రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు.
దీని పట్ల టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాదులోని ఈడి ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ తగలబెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.