నాకు పూరి జగన్నాథ్ ఎంతిష్టమో తెలుసా? నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయనంటే నాకు ఇష్టమే కాదు.. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయనంతే ఎంతిష్టమో చెప్పాలంటే.. నేను నటించిన పౌర్ణమి సినిమా, పోకిరి సినిమా రెండు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే.. అప్పుడు పక్కపక్క థియేటర్లలో అవి ఆడుతుంటే నేను మాత్రం పౌర్ణమి సినిమాకు వెళ్లకుండా.. పోకిరి సినిమా చూశా. ఆయన డైరెక్షన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం.. అంటూ తన పూరిపై తనకున్న అభిమానాన్ని వెలిబుచ్చింది ముద్దుగుమ్మ చార్మి.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమాల్లో నటించనప్పటికీ.. పూరి ప్రొడక్షన్స్ ద్వారా నిర్మాతగా మారి.. పూరితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది చార్మి. ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు చార్మి వర్క్ చేస్తోంది. మే 17న అంటే ఇవాళ చార్మి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేసింది చార్మి.