న‌ర‌సింహ జ‌యంతి- న‌ర‌సింహుని చ‌రిత్ర‌..

-

నారసింహడు అంటె తెలియని హిందువులు ఉండరు. దశావతారాల్లో అత్యంత ఉగ్రరూపంతో కన్పించే మూర్తి నారసింహ్మమూర్తి. విష్ణుమూర్తి దశావతారాల్లో నాల్గో అవతారం నరసింహ్మ అవతారం. స్వామి జయంతిని ఏటా వైశాఖ శుక్ల చతుర్దశినాడు జరుపుకొంటారు. ఈ ఏడాది మే 17న నరసింహ జయంతి. ఈ రోజున స్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు.

హిరణ్యాకశ్యపుడు సంహారం- కశ్య ప్రజాపతికి భార్య దితి. ఆమెకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే కుమారులు ఉన్నారు. లోకకళ్యాణార్థమై హిరణ్యాక్షుడుని విష్ణువు సంహరిస్తాడు. దీంతో సోదరున్ని చంపాడని విష్ణువుపై హిరణ్యకశ్యపుడు వైరం పెంచుకుంటాడు. ఆయన తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రతక్ష్యం చేసుకుంటాడు. చావులేని వరం కావాలని ప్రార్థిస్తాడు. కానీ బ్రహ్మ కొన్ని షరతులతో కూడిన ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. వరం పొందిన హిరణ్యకశ్యపుడు ముల్లోకాలను గడగడలాడిస్తాడు. దేవతలను, ఇంద్రుని సైతం ఓడిస్తాడు. అదే సమయంలో హిరణ్యకశ్యపుడుకి ఒక మగ సంతానం కలుగుతుంది. ఆ బాలుడి పేరు ప్రహ్లాదుడు. అతనికి రాక్షస ప్రవృత్తి రాలేదు. పరమ విష్ణు భక్తుడుగా ఆ పిల్లవాడు మారుతాడు. ఎన్నో రకాలుగా ఆ బాలుడిని మారుద్దామని హిరణ్యకశ్యపుడు ప్రయత్నించి విఫలం అవుతాడు. చివరకు సంహరించాలని ప్రయత్నించినా అదికూడా సాధ్యం కాదు. చివరగా ఒకరోజు ఆ బాలుడిని పిలిచి నీ విష్ణువు ఎక్కడున్నాడో చెప్పమంటాడు.

అప్పుడు ప్రహ్లాదుడు

ఇందుగలడు. అందులేడు అనుటకు సందేహం లేదు ఎందెందు వెతికినా అందందు ఆ స్వామి గలడు అంటాడు. దాంతో ఆగ్రహించిన హిరణ్యకశ్యపుడు ఈ స్తంభంలో చూపించు అని ఆజ్ఞాపించగా ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థిస్తాడు. అంతే స్వామి ఉగ్రస్వరూపంతో మనషిలా కాకుండా, జంతువులా కాకుండా మనిషి, సింహంల మిళితమైన రూపంతో ఆ స్తంభంలో నుంచి అవతరించి హిరణ్యకశ్యపుడున్ని సంహరిస్తాడు. ఆ అవతారమూర్తే నారసింహ అవతారం.

నరసింహ్మ జయంతిన ఏం చేయాలి?

స్వామి వారికి షోడశోషచార పూజలు, నైవేద్యాలు సమర్పించాలి. స్వామి శాంతి కోసం పానకం నివేదించడం ఆనవాయితీ. భక్తితో స్వామి లక్ష్మీనారసింహ్మ కరావలంబం, స్తోత్రమ్, అష్టోతరాలతోపాటు లక్ష్మీదేవి అష్టోతరాలను చదువుకోవాలి.

దర్శించాల్సిన క్షేత్రాలు

యాదగిరిగుట్టలోని పంచనారసింహులను, స్తంబాద్రి, ధర్మపురి నరసింహ్మస్వామి, ఆహోబిలం, అంతర్వేది, సింహాద్రి, మంగళగిరి పానకాలస్వామి తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఉత్తమం. స్వామి అనుగ్రహం ఉంటే అనారోగ్యాలు దరిచేరవు, అదేవిధంగా భూత, ప్రేత, నిశాచర తదితర దుష్టశక్తుల నివారించగలిగే శక్తి సంపన్నుడు స్వామి. ఆయన నామస్మరణను మనసా, వాచా, కర్మణ చేస్తే చాలు ఆయన రక్ష తప్పక లభిస్తుందని పలు గాథలు, పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news