నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టెన్త్ అర్హతతో రైల్వేలో జాబ్స్..పూర్తీ వివరాలు..

-

రైల్వేలో ఉద్యోగాలు చేయాలని భావించే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది..ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్నా విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. టెన్త్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము..

మొత్తం 5636 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nfr.indianrailways.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

నోటిఫికేషన్ విడుదల: మే 30, 22.

అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం: జూన్ 1 ఉదయం 11 గంటల నుంచి..

దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ: జూన్ 30, రాత్రి 10 గంటల వరకు..

విద్యార్హతల వివరాలు:

అభ్యర్థులు టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.

అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి..

అప్లై చేసుకోవడం..

అభ్యర్థులు మొదట nfr.indianrailways.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

తర్వాత ‘NFR recruitment 2022’ లింక్ పై క్లిక్ చేయాలి.

అప్లికేషన్ ఫామ్ లో కావాల్సిన వివరాలను నమోదు చేసి.. సూచించిన డాక్యుమెంట్లను నమోదు చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేసి వివరాలను ఓ సారి చెక్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి..

ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు నోటిఫికేషన్ ను పూర్థిగా చదివి అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news