తెలంగాణలో జూలై లో జరిగే మొత్తం ఎగ్జామ్స్.. తేదీలు..

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ న్యూస్.. జూలైలో వరుసగా 6 ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. తెలంగాణ ఎంసెట్..తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ను జులై 14, 15, 18,19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు..ఇప్పటివరకు మొత్తం 2,61,616 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న బీటెస్, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు.

2. తెలంగాణ ఐసెట్..ఈ ఎగ్జామ్ ను జులై 27, 28 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎగ్జామ్ కోసం 30,941 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు..

3.తెలంగాణ లా సెట్.. జూలై 27న నిర్వహించనున్నారు. పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGLCET 2022) ను ఆగస్టు 8న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం 25 వేలకు పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు..

4.తెలంగాణ ఈసెట్..ఈ పరీక్షలు జూలై 13న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం దాదాపు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

5.తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. ఈ పరీక్షలను కూడా జూలై లో నిర్వహించనున్నారు.ఈ నెల 26, 17 తేదీల్లో నిర్వహించనున్నారు అధికారులు. ఈ పరీక్ష కోసం దాదాపు 17 వేల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు..

6.తెలంగాణ ఫిజికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్..ఆగస్టు 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు…ఇదొక్కటే ఒక నెల టైం పడుతోందని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news