ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలీయా తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా బేబీ త్వరలో వస్తోంది అంటూ రాసుకున్నారు. దీంతో దీనికి సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆలియాభట్ తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బాంద్రా లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆలియాభట్ ఇంట సంబరాలు మొదలవగా.. ఆమె అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు .
అంతే కాదు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా రణబీర్ కపూర్, ఆలియా భట్ దంపతులకు అభినందనలు తెలియజేస్తూ ఉండడం గమనార్హం.ఇక ఈ ఏడాది ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఆలియా.. ఇక ఆలియా సినిమాల విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగూభాయ్ కథియావాడి సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది..
ఇకపోతే మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించింది . ఇక ఆమె నటించిన మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. ఇక ఆ తరువాత డియర్ జిందగీ, హైవే, రాజి మొదలైన సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు మరొకసారి తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోంది ఆలియా.
https://www.instagram.com/p/CfS-_HvMhQ8/?utm_source=ig_web_copy_link