గ్రీన్ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటిన సింగర్ సునీత

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు.

ఇక తాజాగా… రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్క నాటారు టాలీవుడ్‌ స్టార్‌ సింగర్ సునీత.. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు సునీత.

Read more RELATED
Recommended to you

Latest news