టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అంటే ఇష్టమని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది. తెరపై హీరోలతో రొమాన్స్ చేయడం చాలా సులభమైన పని అని ఆమె అభిప్రాయపడింది.” నా అభిప్రాయం ప్రకారం కామెడీ పండించడం చాలా కష్టం. ఫ్రేమ్ లో ఇతర నటుల నటన పై మన టైమింగ్ ఆధారపడి ఉంటుంది. కానీ రొమాన్స్ అలా కాదు, కామెడీతో పోలిస్తే రొమాన్స్ సీన్స్ చాలా సులభం.
ఇప్పటి వరకు రొమాంటిక్ సన్నివేశాలు చేసి చేసి బోర్ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నా.” అని రాశికన్నా తెలిపింది. యాక్టింగ్ లో తనకున్న అభిమానాన్ని తెలియజేసింది రాశి. ప్రస్తుతం ఆమె పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం చేయడంపై తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, కామెడీ చేయగల నటి గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న విడుదల కానుంది. వినోదాత్మక దర్శకుడు మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్, జిఎ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.