ఆ విషయంలో మానసికంగా కృంగిపోయా.. సాయి పల్లవి..!!

-

సాయి పల్లవి .. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ.. అటు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ స్టార్డమ్ అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలోకి ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించినా.. తెలుగులో మొదటిసారి ఫిదా సినిమా తో అడుగుపెట్టి మంత్రముగ్ధుల్ని చేసింది. ఇకపోతే తాజాగా సినీ ఇండస్ట్రీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది సాయి పల్లవి.. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన గ్లామర్ విషయంలో ఎన్నో భయాలు ఉండేవట.. ముఖ్యంగా సినిమాల్లో నార్మల్ లుక్ లో.. చాలా సింపుల్ గా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పింది.Revisiting Premam on Sai Pallavi's birthday: A different kind of star is born | Entertainment News,The Indian Express

తన మొదటి ప్రేమమ్ లో నటించేటప్పుడు.. తన అందం గురించి విపరీతమైన ఆలోచనలు కూడా ఉండేవి కాదని.. వాటిపై ఒక క్లారిటీ అంటూ లేదని.. ఏం చేయాలో అర్థం కాలేదు అని ఆమె తెలిపింది.. కాలేజీ సమయం లోనే సినిమాల్లోకి వచ్చానని సాయి పల్లవి తెలిపింది.. సాధారణంగా హీరోయిన్స్ ఫేస్ పైన మచ్చలు లేకుండా చక్కగా అందంగా కనిపించే వారని ఆమె పేర్కొంది.. కానీ తనకు ముఖం మీద ఎక్కువగా మచ్చలు , పింపుల్స్ ఉండేవని , అందుకే సినీ ఇండస్ట్రీలో సెట్ అవుతుందా లేదా అని ఎన్నో రకాల ఆలోచనలు కూడా ఉండేవని సాయిపల్లవి తెలిపింది. ఇక ఈ విషయంలో ఎన్నోసార్లు మానసికంగా చాలా బాధపడేదాన్ని..ఈ సినిమా హీరోయిన్ ఏంటి.. ఇలా ఉందంటూ కామెంట్ వస్తాయేమో అని భయపడేదాన్ని అని తెలిపింది..My Movie Milestone: Sai Pallavi On Premam | Film Companion

తాను మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, నేను ఆలోచించే విధానం చాలా తప్పు అని..తనకు మరింత స్పష్టంగా తెలిసి వచ్చిందని తెలిపింది. ఎవరైనా సరే పైకి కనిపించే అందాన్ని కాకుండా క్యారెక్టర్ కి ఎక్కువగా విలువ ఇస్తారు అని అర్థమైంది అని, మనసు తేలిక పడింది అని ఆమె చెప్పింది.. ప్రేమమ్ సినిమాలో తన ఆత్మవిశ్వాసం బలపడింది అని ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news