టిడిపి అధినేత నారా చంద్రబాబుపై హీరో విశాల్ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీచేసి గెలిచి వ్యక్తి భరత్ మాత్రమేనని.. భరత్ కే కుప్పం సీటు అని పేర్కొన్నారు. మాజీ మంత్రి అమరనాధరెడ్డిని అరవైవేల ఓట్లుతో ఈసారి ఓడిస్తారని..చంద్రబాబు కళ్ళు కనపడతున్నాయో… లేదో ? అని ఎద్దేవా చురకలు అంటించారు.
ఇరవై పార్లమెంటు స్దానాల్లో ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.. 2024 ఎన్నికలలో 175కు 175 స్దానాల్లో గెలుస్తామని ప్రకటించారు. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం లో ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సిఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని.. మ్యానిఫెస్టో లో అన్ని హామీలను అమలు చేసిన ఘనత సిఎం జగన్ ది అన్నారు. గ్రామ, సచివాలయం ద్వారా అన్నీ పధకాలు అందిస్తు అభివృద్ధి చేస్తున్న ఘనత మనదని వెల్లడించారు.