జూలై 5వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిసి కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సహ ధర్మకర్తల మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. కాగా జూలై 5వ తేదీన బల్కంపేట అమ్మవారి కళ్యాణం, అదే రోజు నుంచి ఎల్లమ్మ బోనాలు అనేవి ప్రారంభంకానున్నాయి.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి 2.5 కిలోల బంగారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనం సమర్పిస్తోంది. అలాగే బంగారు తాపడంతో రుద్రాక్ష మండపం నిర్మాణం నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే అనేక మంది భక్తుల కోసం 5 కోట్లతో మల్టీలెవల్ పార్కింగ్ నూతన భవన నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.