సంతానలేనితో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..?

-

ఇటీవల కాలంలో చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య సంతాన లేమి.. చాలా మంది పెళ్లయి ఎన్నాళ్ళు అయినా సరే పిల్లలు పుట్టడం లేదు అంటూ చాలా దిగులు పడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు పుట్టక పోయే సరికి భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరుగుతోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే సంతాన లోపం గనుక కలిగితే ముందుగా అమ్మాయిని మాత్రమే ఈ సమాజం నిందిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల్లో సంతాన సామర్థ్యం గురించే నిర్మొహమాటంగా ఈ సమాజంలో మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది.. అంతేకాదు స్త్రీలు సంతాన ఉత్పత్తి పరీక్షలకు హాజరవ్వడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు. కానీ మగవారు మాత్రం సంతానం కలగజేసే సామర్థ్యం తమకు ఉందో లేదో పరీక్షించుకోవడానికి చాలా భయపడిపోతున్నారు.

అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సమాజం నవ్వుతుందనో..అత్తారింట్లో మర్యాద పోతుందనో..సూటిపోటి మాటలు పడాల్సి వస్తుందో ఏమో అని ఇలా రకరకాల భయాలతో భయపడిపోతున్నారు. నిజానికి సంతాన ప్రాప్తి కలగాలి అంటే ఆడ , మగ ఇద్దరి బాధ్యత సమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారితో పాటు మగవాళ్ళు కూడా ఈ సమస్యకు కారణం అవుతారు కాబట్టి ఇద్దరూ కూడా సరైన నియమ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తే సంతాన సాఫల్యతను పెంచుకోవచ్చు. ఇక ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అంటే దానిమ్మ.. ఆడవారి యొక్క గర్భాశయంలో రక్త ప్రసరణ ను పెంచితే.. పురుషులలో వీర్యకణాల సంఖ్య ను, నాణ్యతను పెంచుతుంది. ముఖ్యంగా పిల్లలను కనాలని అనుకునేవారు దానిమ్మ ను ఏదోక రూపంలో ప్రతిరోజు తీసుకోవాలి.

ఇక పాలు అలాగే పాల పదార్థాలను కూడా ప్రతిరోజు తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తి పెంచి సంతాన ఉత్పత్తికి అవకాశాలు పెరుగుతాయి. ఇక అలాగే ఖర్జూరాలు, సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అంతే కాదు విటమిన్ సి, విటమిన్ డి, జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సంతానలేని సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news