తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కెసిఆర్ ప్రభుత్వం. అంగవైకల్యం నలభై శాతం ఉన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ఇలాంటి శరత్తులు లేకుండా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం.
కుటుంబంలో ఎంతమంది ఉన్నా… ఆ కుటుంబానికి ఆదయ పరిమితులను మినహాయించి రేషన్ కార్డు జారీ చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో దివ్యాంగులకు రేషన్ కార్డు కోసం ఆదయ పరిమితి నిబంధన ఉండేది. కాగా తాజా నిర్ణయంతో ఇప్పుడు నిబంధనలను తొలగించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు చాలా మేరకు లబ్ధి చేకూరనుంది.