సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..ఇక గురుకులాల్లో కూడా ఇంటర్మీడియేట్ విద్య

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియేట్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియేట్ కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు.

బాలికలకు ప్రత్యేకంగా విద్యను అందిస్తున్న కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియేట్ విద్యను ప్రవేశ పెట్టాలని సీఎం అన్నారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలన్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది? వారు పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని సీఎం అన్నారు. ఐఏఎస్ / ఐపీఎస్ / ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news