భారత రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

-

భారత రాజ్యాంగం పై కేరళ మత్స్య శాఖ మంత్రి సాజి చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సిపిఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.’ వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చెరియన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదు అని చెప్పారు. పాలన వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news