జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరు మార్చాలంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ట్వీట్ చేశారు. గతంలో ఉన్న ఏపీ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకాన్ని జగనన్న విదేశీ విద్య దీవెన పథకంగా మార్చడం షాక్ కి గురిచేసిందన్నారు. ఈ పథకం పేరు ను మళ్లీ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుగా మార్చాలని.. జై భీమ్ అంటూ ట్వీట్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, బ్రాహ్మణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఆర్థిక సహాయం అందించింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చి అంబేద్కర్ పేరు స్థానంలో జగనన్న విదేశీ విద్య దీవెన పథకంగా చేశారు. అయితే అంబేద్కర్ పేరు తొలగించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Really shocked to know that “AP Ambedkar Overseas Vidya Nidhi Scheme” has been changed to “Jagananna Videshi Vidya Deevena Scheme”. I demand that the scheme has to be named only after ‘Bharat Ratna’ Dr B R Ambedkar Saab. Jai Bheem!!
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 14, 2022