హైజినిక్గా ఉండే ప్రయత్నంలో కొందరు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. అవి వారికి అప్పుడు తెలియదు.. కానీ దీర్ఘకాలంగా అదే పద్దతులు పాటిస్తే రిజల్ట్ అప్పడు బయటపడుతుంది. కొంతమంది చెవిలో సేఫ్టీపిన్ పెట్టి తిప్పకుంటారు. ఇది చాలా ప్రమాదం. ఇంకొందరు అయితే ఏకంగా..అగ్గిపుల్ల పెట్టి తిప్పేస్తారు..ఇదీ డేంజర్.. నేను అలా కాదు.. ఇయర్ బడ్స్ పెట్టి క్లీన్ చేసుకుంటా అనుకుంటున్నారా.? ఇలా కూడా అదేపనిగా చేయడం తప్పే. సరే మన విషయం పక్కన పెడితే.. చిన్నపిల్లలు కూడా ఇయర్ బడ్స్హే వాడుతుంటారు. వాళ్లు ఇలా చేయడం హానికరమట.? ఎందుకో..
చిన్నారులు స్నానం చేసిన తరువాత చెవులను శుభ్రం చేసేందుకు ఉపయోగించే కాటన్ బడ్స్ పిల్లలకు మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయి. ఇది చెవికి గాయం కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చెవులను శుభ్రం చేయడానికి కాటన్ బడ్స్ని ఉపయోగించడం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చెవిలో బడ్స్ కారణంగా చిన్నగాయం పెద్దదిగా మారి చివరకు వినికిడి శక్తిని చిన్నారులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందట. చెవిలోని వినికిడి ఎముకలు, లోపలి చెవికి దెబ్బతగలటం వంటి కొన్ని తీవ్రమైన కేసులు ఇప్పటికే అనేకం నమోదయ్యాయి. ఈ పరిస్ధితి చిన్నారుల్లో కోలుకోలేని వినికిడి నష్టానికి దారితీస్తుంది.చెవిలోపలి భాగంలో చర్మంపై సున్నితమైన మైనపు పూత ఉంటుంది. ఇది చెవి రక్షణకు సహాయపడుతుంది. కాటన్ ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఆపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.
సాధారణంగా నమలడం, దవడ కదలికలు, చెవి లోపల చర్మం పెరగడం గుమిలిని సహజంగా బయటకు నెట్టేస్తుంది..ప్రత్యేకించి దానిని కాటన్ బడ్తో శుభ్రం చేయాల్సిన పనిలేదు. కాటన్ బడ్ను ఉపయోగించటం వల్ల సున్నితమైన చెవిలోపలి చర్మం, కర్ణభేరి తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.
చెవిలో నొప్పి, దురద, చెవి నిండుగా ఉన్న భావన, చెవిలో రింగింగ్ శబ్ధాలు, వినికిడి లోపం ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. చిన్నపిల్లల అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిపై ఆ స్జేజ్లో కొంచెం ఒత్తిడి చేసినా వారు ఎదిగే కొద్ది సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు.